Step into an infinite world of stories
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పండితుడుగా, రచయితగా తన జీవితంలో అనుభవించిన, అనుభవాలూ - జ్ఞాపకాలు గల కలశమిది. తెనుగు వాజ్మయంలో ఈ రకం గ్రంధలకిదే మొదటిది. స్వీయ చరిత్రలు, అత్మకధలలో ఆణిముత్యమిది. మహామహులైన పండితులు, రచయితలు, మిక్కిలి అపూర్వమైన గ్రంథమని కొనియాడిన సుగ్రంధమిది. మొదట వైదిక విద్యలు నేర్చుకుని, 13వ యేటనే కధలు రాయడం ప్రారంబించి, అగత్యమైన తెనుగు పాండిత్యం గడించుకోవడంలోను, రచన చెయ్యడంలోను, శ్రీపాద వారు ఎదుర్కొన్న ప్రతిబంధకాలు, అనుభవించిన నిర్భంధాలు, పొందిన ఆవేదన, పట్టిన దీక్ష, చేసిన సాధనా, ఆ సాధనాలో వారు కనపరచిన పరాకాష్ట, తత్పలితంగా వారు పొందిన విజయాలు, గ్రంధ ప్రకటనకు కలిగిన - కలుగుతూనూ వున్న ఇబ్బందులు - ఇవన్ని పాటకుల హృదయాలు కరిగించడమే కాదు, రాసమహిమలున్నూ చేస్తాయి చదివితే. అనేక చోట్ల - అనేక సందర్భాల్లో - అనేక మాట్లు రాత ప్రతిని చదివించుకుని విని, అనేకులు మిక్కిలి ముగ్దులయి వున్నారు. మరి మీరు చదవరా? తెలుగు రచయతలందరూ తప్పక చదవాల్సిన ఓ మహా రచయిత స్వీయ చరిత్ర .
© 2021 Storyside IN (Audiobook): 9789354836589
Release date
Audiobook: 1 October 2021
English
India