Step into an infinite world of stories
"దేవదాసి వ్యవస్థ నేపథ్యంగా వచ్చిన నవల ‘మనోధర్మపరాగం’. 120 యేళ్ల సుదీర్ఘ కాలాన్ని కేన్వాసుగా తీసుకుని చరిత్రనూ, కల్పననూ కలగలిపి ఈ రచన చేశారు. ఇందులోని ప్రతి సంఘటనా అంతకు ముందు ఎక్కడో విన్నట్లే, చదివినట్లే అనిపిస్తుంది. అంతకు ముందే ఎం.ఎస్.సుబ్బలక్ష్మి మీద తెలుగులో వచ్చిన పుస్తకాల ప్రభావం కావచ్చు. కళావంతులు అనే పేరు సూర్యబలిజగా మారిపోయినట్లే ఈ నవలలో మధురై, చిత్తూరుగా మారిపోయింది చారిత్రక పాత్రలనే తీసుకున్నా, రచయిత ఊహాశక్తికి అనుగుణంగా కల్పన సాగింది. ప్రతి పాత్రా రచయితతో సంభాషించే ఎత్తుగడ నవలకు కొత్తదనాన్నిచ్చింది. సుబ్బలక్ష్మి జీవిత కథనూ, జీవిత చరిత్రనూ అంతకు ముందు చదవని పాఠకుల మనో ప్రపంచంలో ‘మనోధర్మపరాగం’ నవల కొత్త తలుపులు తెరుస్తుంది. ఈ నవలలోని దేవదాసి నేపథ్యంపై రచయిత మధురాంతకం నరేంద్ర మాటలలో చదవండి."
© 2022 Storyside IN (Audiobook): 9789355445384
Release date
Audiobook: 15 May 2022
English
India